SBI PO Results: ఎస్‌బీఐ పీవో మెయిన్స్ ఫలితాలు విడుదల
SBI PO mains exam results: ఎస్‌బీఐ బ్యాంకు పీవో మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కింద పీడీఎఫ్‌లో చెక్ చేసుకోవచ్చు.
ముంబయి: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI) శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు (sbi po mains result) విడుదలయ్యాయి. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 30న మెయిన్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే . ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జాబితాను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఫేజ్ 3లో భాగంగా నిర్వహించే సైకోమెట్రిక్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రొమోషన్ విభాగం ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌బీఐ ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 1673 పోస్టుల్లో 1600 రెగ్యులర్ కాగా.. 73 బ్యాక్‌లాగ్ ఖాళీలు. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను మొత్తం మూడు దశల్లో ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష పూర్తి చేసిన అధికారులు.. మూడో దశలో నిర్వహించేందుకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఫలితాలను ఈ కింది పీడీఎఫ్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు