Sankranti Special Trains: సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. అదనపు కోచ్‌లు ఏర్పాటు!

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆ వివరాలివే..

Updated : 11 Jan 2024 19:02 IST

Sankranti Special Trains| సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేసింది.  ఈ రైళ్లు సికింద్రాబాద్‌, నర్సాపూర్‌, శ్రీకాకుళం మధ్య జనవరి 12, 13, 14 తేదీల్లో సర్వీసులందించనున్నాయి. ఈ రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సాధారణ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌. రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలివే.. 

  • హైదరాబాద్‌ - శ్రీకాకుళం రోడ్‌ ప్రత్యేక రైలు (07178) జనవరి 12న రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.45గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.
  • శ్రీకాకుళం రోడ్‌ - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (07179) జనవరి 13న శ్రీకాకుళంలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌కు రానుంది.
  • సికింద్రాబాద్‌ - నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07176) జనవరి 13న రాత్రి 10.05గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంటలకు నర్సాపూర్‌ చేరుకోనుంది.
  • నర్సాపూర్‌ - సికింద్రాబాద్‌  ప్రత్యేక రైలు (07177) జనవరి 14న సాయంత్రం 6గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు హైదరాబాద్‌ చేరుకోనుంది.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లలో తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఆ కోచ్‌ల వివరాలు ఇవే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని