palnadu: నరసరావుపేటలో రెండో రోజు సిట్‌ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్‌కు మంత్రి అంబటి

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్‌ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది.

Published : 19 May 2024 18:15 IST

నరసరావుపేట: పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్‌ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విచారణ కొనసాగగా.. ఇవాళ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అడిషినల్‌ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో సిట్‌ అధికారులు ముమ్మర విచారణ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అల్లర్లు జరిగిన సమయంలో వీడియోలను అధికారులు పరిశీలించారు. ఇదే సమయంలో కారంపూడి పోలీస్‌స్టేషన్‌లోనూ దర్యాప్తు చేశారు. దాడులు, ఘర్షణలకు సంబంధించిన కేసుల రికార్డులను పరిశీలించారు. స్థానిక సీఐ నుంచి సిట్‌ డీఎస్పీ రామ్మూర్తి వివరాలు సేకరించారు.

మరోవైపు సిట్‌ దర్యాప్తు జరుగుతున్న నరసరావుపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై ఫిర్యాదు చేసేందుకు అంబటి వచ్చినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు