kazipet-vijayawada : కాజీపేట-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు

కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Published : 04 Dec 2023 12:05 IST

వరంగల్‌ : కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 7వ తేదీతోపాటు 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 6వ తేదీతోపాటు, 10 నుంచి 18 వరకు, ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 5 నుంచి 19 వరకు రద్దు చేశారు.

కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ ప్యాసింజర్‌ పుష్‌ఫుల్‌ రైళ్లను ఈ నెల 10 నుంచి 18 వరకు, కాజీపేట-తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి రైళ్లను కూడా ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు చేశారు. అలాగే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 11 నుంచి 19 వరకు కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది. భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6 నుంచి 8 వరకు, 10 నుంచి 19 వరకు హసన్పర్తి రోడ్ వరకు మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని