AP Election Violence: ఏపీలో ఎన్నికల హింస ఘటనలపై పూర్తి నివేదిక సమర్పించిన సిట్‌

ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై పూర్తి నివేదికను డీజీపీ కార్యాలయానికి సిట్‌ సమర్పించింది.

Updated : 10 Jun 2024 23:23 IST

అమరావతి: ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై పూర్తి నివేదికను సిట్‌ డీజీపీ కార్యాలయానికి సమర్పించింది. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 11 మంది అధికారులతో సిట్‌ను ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. 264 పేజీలతో రెండు భాగాలుగా సిట్‌ నివేదికను రూపొందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్లు సిట్‌ తన నివేదికలో వెల్లడించింది. ఆరు కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు, ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు రెండు ఉన్నట్లు పేర్కొంది. పల్నాడు జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదని అభిప్రాయపడింది.

నిందితుల్ని ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదంది. నిందితుల్ని ఎఫ్‌ఐఆర్‌లో ఆగంతుకులుగా నమోదు చేయడంపై సిట్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులు ఎవరో తెలిసినా అరెస్టు చేయకపోవడాన్ని నివేదికలో పేర్కొంది. నిందితులకు శిక్ష పడేవరకు ఎస్పీలు, డీఐజీలు పర్యవేక్షించాలని సూచించింది. కొన్ని ఘటనల్లో ఆధారాలను పోలీసులు సేకరించలేకపోయారంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో బీఎల్వో ఆలస్యంగా ఫిర్యాదు చేశారని, ప్రిసైడింగ్‌ అధికారి అసలు ఫిర్యాదు చేయలేకపోవడాన్ని సిట్‌ ప్రశ్నించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు