AP news: తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్‌’ విచారణ.. పలు విషయాలపై ఆరా!

జిల్లాలోని చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సిట్ విచారణ చేపట్టింది. వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్‌ ఈశ్వర్‌, గ్రామస్థులను అధికారులు విచారించారు.

Published : 19 May 2024 14:10 IST

తిరుపతి: ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పలుచోట్ల సిట్‌ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లెలో సిట్‌ అధికారులు పలువురిని విచారించారు. కూచువారిపల్లెలో వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్‌ ఈశ్వర్‌, గ్రామస్థులను అధికారులు విచారించి పలు విషయాలపై ఆరా తీశారు. రామిరెడ్డిపల్లె సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని సిట్‌ అధికారులు పరిశీలించారు. అనంతరం పలువురు గ్రామస్థులను విచారించారు. 

తిరుపతి నగరంలోనూ సిట్‌ బృందం విచారణ కొనసాగింది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్వీయూ క్యాంపస్‌ పోలీసు స్టేషన్‌లో కేసులను పరిశీలించారు. అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీలో సిట్‌ బృందం విచారణ చేపట్టింది. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది.క్షేత్ర స్థాయిలో పర్యటించిన బృందం నివేదిక ఈసీకి అందజేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని