AP News: తిరుపతి చేరుకున్న సిట్‌ బృందం.. విచారణ ప్రారంభం

ఏపీలో పోలింగ్‌ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్‌ బృందం తిరుపతికి చేరుకుంది.

Published : 18 May 2024 12:54 IST

తిరుపతి: ఏపీలో పోలింగ్‌ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్‌ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్‌ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సిట్‌ పునఃసమీక్షించనుంది. అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్‌ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైనా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన విషయం తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని