ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ నివేదిక సిద్ధం

ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్‌ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది.

Published : 20 May 2024 08:34 IST

అమరావతి: ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్‌ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఈ బృందం పర్యటించింది. నేతలు, స్థానికులు, పోలీసులను అధికారులు విచారించారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఏపీలోని పల్నాడు, మాచర్ల, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇటీవల 13 మందితో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని