Amaravati: ఏపీలో రాజకీయ హత్యలపై ఈసీ సీరియస్‌.. వివరణ ఇచ్చిన ఎస్పీలు

ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు గురువారం సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు.

Updated : 21 Mar 2024 19:15 IST

అమరావతి: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వివరణ తీసుకున్నారు. ముగ్గురు ఎస్పీలు గురువాం సీఈవో మీనా ఎదుట హాజరుకాగా.. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  

శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? రాజకీయ హత్యల దాకా పరిస్థితులు దిగజారే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని ఎస్పీలను ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గం చాలా కాలంగా సున్నిత ప్రాంతాల జాబితాలో ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని నిలదీశారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో నేరుగా ఈసీ నిఘా పెట్టిందన్నారు. ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికలను సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని