TTD: ఈనెల 12న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల: తితిదే

2023 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 10 Dec 2022 01:50 IST

తిరుమల: 2023 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ డిసెంబరు 12న ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 14న ఉదయం 10గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఆతరువాత లక్కీడిప్‌లో టికెట్లు కేటాయించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని