Star Sand: ఇసుక రేణువులా.. ఆకాశంలో నక్షత్రాలా!
జపాన్‌లోని ఒకినావా ప్రాంతంలోని ఇరిమోటె ఐలాండ్.. చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ, అక్కడి ఇసుకలోనే ఓ ప్రత్యేకత ఉంది. మాములుగా ఇసుక రేణువులు ఎలా ఉంటాయి? గుండ్రగానే కదా..! కానీ, ఈ బీచ్‌లో మాత్రం నక్షత్రం ఆకారంలో కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే వీటి ఆకారాన్ని
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని ఒకినావా ప్రాంతంలోని ఇరిమోటె ఐలాండ్.. చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ, అక్కడి ఇసుకలోనే ఓ ప్రత్యేకత ఉంది. మాములుగా ఇసుక రేణువులు ఎలా ఉంటాయి? గుండ్రగానే కదా..! కానీ, ఈ బీచ్‌లో మాత్రం నక్షత్రం ఆకారంలో కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే వీటి ఆకారాన్ని ఏ మాత్రం గుర్తించలేము. గుండ్రని ఇసుక రేణువుల్లో మిలితమై ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఓ రకమైన ఆల్గే, ప్రోటోజోవా వంటి ఏక కణ జీవులు ఈ సముద్ర ప్రాంతంలో ఉండేవట. అవి చనిపోయిన తర్వాత వాటి శరీరంపై ఉండే కాల్షియం కార్బొనేట్ పెంకులు ఇసుకలో కలిసిపోయాయి. అయితే, ఆ పెంకులపై సముద్రపు అలలు ఎగిసిపడుతుడటంతో అవి అరిగిపోయి నక్షత్రం ఆకారంలోకి మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీటిని జపనీయులు హోషిజునా నో హమా అని పిలుస్తారు. అంటే నక్షత్రం ఆకారంలో ఉండే ఇసుక అని అర్థం. మిల్లీమీటర్ సైజులో ఉండే నక్షత్రపు ఇసుక రేణువులు బీచ్‌లో నడుస్తున్నప్పుడు కాళ్లకు అంటుకుపోతాయి. ఇవి ఇంట్లో ఉంటే అదృష్టం కలుగుతుందని జపాన్ ప్రజలు నమ్ముతారు. అందుకే, ఈ బీచ్ సందర్శనకు వచ్చినప్పుడు నక్షత్రం ఆకారంలో ఉండే ఈ ఇసుక రేణువుల్ని ఇంటికి తీసుకెళ్తుంటారు. వ్యాపారులు వీటిని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తుంటారు. దీంతో ఇవి అంతరించిపోకుండా ఉండటానికి స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు వీటిని ఇంటికి తీసుకెళ్లడాన్ని నిషేధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్‌ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్‌పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్‌పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్