విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల మహా పాదయాత్ర

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు మహా పాదయాత్ర నిర్వహించాయి.

Updated : 03 Mar 2024 13:51 IST

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు మహా పాదయాత్ర నిర్వహించాయి. కూర్మన్న పాలెంలోని దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లారు. రానున్న ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మేనిఫెస్టోలో పెట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ పాదయాత్రలో తెదేపా, వామపక్షాల నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని