AP CEO: జగన్‌పై రాయితో దాడి.. సమగ్ర నివేదిక కోరిన సీఈవో

ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.

Published : 15 Apr 2024 17:59 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. విజయవాడ సీపీ కాంతిరాణా, ఐజీ రవిప్రకాశ్‌ను పిలిపించి ఘటనపై సోమవారం సమీక్షించారు. జగన్‌ చేపట్టిన బస్సు యాత్రలో బందోబస్తు ఉన్నప్పటికీ.. ఎలా దాడి చేయగలిగారని సీఈవో ప్రశ్నించారు. ఈ ఘటనలో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు వేగవంతం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఈవో ఆదేశించారు.  వీఐపీల పర్యటనలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని