జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది.

Published : 24 Apr 2024 13:16 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చని న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. గురువారం నుంచి శనివారం వరకు నిందితుడిని పోలీసులు విచారించనున్నారు. సతీష్‌ ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని