Viveka Murder Case: అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది: సునీత

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Updated : 13 Jun 2023 21:25 IST

దిల్లీ: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు (TS High Court) మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి వివేకా (Viveka Murder Case) కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ (CBI) సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.

‘‘సీబీఐ దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆయన హాజరుకాలేదు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారు. అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లినా ఎంపీ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తూ.. ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారు. అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది. ఆయనకు అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉంది. సీబీఐ అధికారులపై అవినాష్‌ తప్పుడు ఫిర్యాదులు చేశారు.. వారిపై ప్రైవేట్‌ కేసులు నమోదు చేయించారు’’ అని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  సునీత వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని