Suneetha Narreddy: ‘వివేకం’ సినిమా కంటే రియాలిటీ ఇంకా ఘోరం: సునీత

ఏపీ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని.. దాని నుంచి బయటకు రావాలని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి (Suneetha Narreddy) అన్నారు.

Updated : 02 Apr 2024 14:03 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని.. దాని నుంచి బయటకు రావాలని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి (Suneetha Narreddy) అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ‘వివేకం’ సినిమాపై స్పందించారు.

‘‘డాక్యుమెంటరీ అనాలో.. సినిమా అనాలో తెలియడం లేదు. ఎవరో కానీ.. చాలా ధైర్యంగా తీశారు. అందులో కొన్ని వ్యక్తిగత అంశాల్లో తేడా ఉండొచ్చు. చివరి అరగంట నాకే భయమేసింది. ఆ సమయంలో కళ్లు మూసుకున్నా. రియాలిటీని తలచుకుంటే మాత్రం ‘వివేకం’ సినిమాను చాలా లైట్‌గా తీశారు. రియాలిటీ ఇంకా ఘోరంగా ఉంది. గత ఎన్నికల్లో హత్యను రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నేనెప్పుడు రాజకీయాల్లో లేను. తప్పు జరుగుతోంది కాబట్టే బయటకి వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నా. వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యక్తిగతంగా నాతో పాటు ఈ రాష్ట్రానికీ మంచిది కాదు’’ అని సునీత వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని