Viveka murder case: సునీత పిటిషన్‌.. శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

Published : 08 Apr 2024 14:02 IST

దిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. శివశంకర్‌రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కోరింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్‌రెడ్డి ఏ5గా ఉన్నారు. ఆయనతో పాటు ప్రతివాదులందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా దర్యాప్తు సంస్థ సీబీఐని కూడా సునీత చేర్చారు. 

వాదనల సమయంలో విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఛార్జెస్‌ ఫ్రేమ్‌ చేసే దశలోనే ఉన్నట్లు సునీత తరఫు న్యాయవాది బదులిచ్చారు. ప్రతి దశలోనూ ట్రయల్‌ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా బెయిల్‌ పొందారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ1కు గతంలో బెయిల్‌ రాగా.. సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. ఈ నెల మూడో వారంలో ఇదే ధర్మాసనం ముందుకు వస్తుందని చెప్పారు. ఏ8 మాత్రం ముందస్తు బెయిల్‌పై ఉన్నారని.. దీనిపై ఇప్పటికే సవాల్‌ చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని