జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమెందుకు?: సీబీఐకి సుప్రీం ప్రశ్న

జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది.

Updated : 01 Apr 2024 11:23 IST

దిల్లీ: జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెబుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. విచారణ వేగంగా పూర్తిచేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఆదేశించింది. 

డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు. బెయిల్‌ రద్దు, కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు