Volunteer: సమ్మెలో పాల్గొన్న ముగ్గురు వార్డు వాలంటీర్లపై వేటు

వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన ముగ్గురు వార్డు వాలంటీర్లపై వేటు పడింది.

Published : 28 Dec 2023 22:48 IST

అమలాపురం: వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన ముగ్గురు వార్డు వాలంటీర్లపై వేటు పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ముగ్గురు వార్డు సచివాలయ వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టు అమలాపురం పురపాలక సంఘం కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ వేతనాన్ని రూ.18 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు