Telangana Cabinet: ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్‌ భేటీ వాయిదా

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. 

Published : 18 May 2024 19:49 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి రాకపోవడంతో కేబినెట్‌ భేటీని రద్దు చేశారు. శనివారం సాయంత్రం మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించింది. ఇందుకు సంబంధించిన అజెండాను కూడా సీఎస్‌ సిద్ధం చేశారు. కానీ, ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సచివాలయం నుంచి తిరిగి వెళ్లి పోయారు. ఈసీ అనుమతి వచ్చినప్పుడే కేబినెట్‌ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఎల్లుండి లోపు ఈసీ అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి దిల్లీ వెళ్లి ఈసీ అనుమతి కోరాలని సీఎం నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో పాటు, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 27న ఉండటంతో కేబినెట్‌ సమావేశానికి ఈసీ అనుమతించలేదని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని