Telangana EAPCET: ఈఏపీ సెట్‌ ఫలితాలు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 18 May 2024 13:16 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,40, 618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలో 89 శాతం.. ఇంజినీరింగ్‌ విభాగంలో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం.

ఇంజినీరింగ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇంజినీరింగ్‌లో ర్యాంకులు..

  • మొదటి ర్యాంకు-ఎస్‌.జ్యోతిరాదిత్య(శ్రీకాకుళం-పాలకొండ)
  • రెండో ర్యాంకు- హర్ష(కర్నూలు-పంచలింగాలు)
  • మూడో ర్యాంక్‌-రిషి శేఖర్‌ శుక్లా(సికింద్రాబాద్‌-తిరుమలగిరి)
  • నాలుగో ర్యాంకు-సందేశ్‌(హైదరాబాద్‌-మాదాపూర్‌)
  • ఐదో ర్యాంకు-సాయి యశ్వంత్‌ రెడ్డి(కర్నూలు)
  • ఆరో ర్యాంకు- పుట్టి కుశల్‌ కుమార్‌(అనంతపురం-ఆర్కేనగర్‌)
  • ఏడో ర్యాంకు- హుండికర్‌ విదీత్‌(హైదరాబాద్‌-పుప్పాలగూడ)
  • ఎనిమిదో ర్యాంకు-రోహన్‌(హైదరాబాద్‌-ఎల్లారెడ్డి గూడ)
  • తొమ్మిదో ర్యాంకు-కొంతేమ్‌ మణితేజ(వరంగల్‌-ఘన్‌పూర్‌)
  • పదో ర్యాంకు-ధనుకొండ శ్రీనిధి(విజయనగరం)

అగ్రికల్చర్‌, ఫార్మసీలో ర్యాంకులు..

  • మొదటి ర్యాంకు-ప్రణీత(మదనపల్లె)
  • రెండో ర్యాంకు-రాధాకృష్ణ(విజయనగరం)
  • మూడో ర్యాంకు-శ్రీవర్షిణి(హనుమకొండ)
  • నాలుగో ర్యాంకు-సాకేత్‌ రాఘవ్‌(చిత్తూరు)
  • ఐదో ర్యాంకు- సాయి వివేక్‌(హైదరాబాద్‌-ఆసిఫ్‌నగర్‌)
  • ఆరో ర్యాంకు-మహమ్మద్‌ అజాన్‌సాద్‌(హైదరాబాద్‌-నాచారం)
  • ఏడో ర్యాంకు-వడ్లపూడి ముకేశ్‌ చౌదరి(తిరుపతి-వెంగమాంబపురం)
  • ఎనిమిదో ర్యాంకు-భార్గవ్‌ సుమంత్‌(హైదరాబాద్‌-పేట్‌బషీరాబాద్‌)
  • తొమ్మిదో ర్యాంకు-జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్‌-అల్విన్‌ కాలనీ)
  • పదో ర్యాంకు- దివ్యతేజ(శ్రీసత్యసాయి జిల్లా-బలిజపేట)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని