Nagarjuna Sagar: సాగర్ వద్ద పూర్వస్థితిని పునరుద్ధరించండి: కేఆర్‌ఎంబీని కోరిన తెలంగాణ

నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam) వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది.

Published : 04 Dec 2023 20:16 IST

హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam) వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్‌ను తెలంగాణనే నియంత్రించాలని ఈఎన్సీ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేశారు. డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపునకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా తక్షణమే స్పందించాలని కేఆర్‌ఎంబీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని