Ts high court: ఎన్నిక వివాదం.. హైకోర్టులో శ్రీనివాస్‌ గౌడ్‌ పిటిషన్‌ కొట్టివేత

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి వేసిన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది.

Published : 25 Jul 2023 15:50 IST

హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి వేసిన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదని 2019లో రాఘవేంద్రరాజు పిటిషన్‌ వేశారు. ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్‌లో దాచిపెట్టారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని గతంలో పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. హైకోర్టుకు పంపించింది. ఇవాళ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. శ్రీనివాస్‌గౌడ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని