Telangana: అమెరికాలో రెండు జెట్‌స్కీలు ఢీ: తెలంగాణ వాసి మృతి..!

అమెరికాలో జరిగిన జెట్‌స్కీ ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందారు. అతడిని కాజీపేట్‌ వాసిగా గుర్తించారు. 

Updated : 13 Mar 2024 12:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడిని వెంకట రమణ పిట్టల (27)గా గుర్తించారు. అతడు ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. స్థానిక మీడియా కథనం ప్రకారం మార్చి 9వ తేదీన విస్టిరీయా ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంకట రమణ యమహా పర్సనల్‌ వాటర్‌క్రాఫ్ట్‌ (జెట్‌స్కీ)ను అద్దెకు తీసుకొన్నాడు. ఆ తర్వాత అక్కడి ఫ్లోటింగ్‌ ప్లేగ్రౌండ్‌లో వాడాడు. అదే సమయంలో మరో జెట్‌స్కీ వేగంగా ఢీకొనడంతో వెంకట రమణ ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ ఘటనలో రెండో జెట్‌స్కీ నడుపుతున్నది 14 ఏళ్ల బాలుడుగా గుర్తించారు. అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మృతుడు రమణది తెలంగాణలోని కాజీపేట్‌ ప్రాంతం. మరో రెండు నెలలు ఉంటే అతడి చదువు పూర్తయ్యేది. అతడు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ నుంచి ఫిజియోథెరపీ  పూర్తి చేశాడు. భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ కారణాలతో కనీసం ఎనిమిది మంది భారతీయ మూలాలున్న విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని