KRMB: కేఆర్‌ఎంబీ, ఆర్‌ఎంసీ భేటీకి తెలంగాణ సభ్యుల గైర్హాజరు

హైదరాబాద్‌ జలసౌధలో ఏర్పాటు చేసిన కేఆర్‌ఎంబీ, ఆర్‌ఎంసీ సమావేశానికి తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు. ఏపీ నుంచి ఈఎన్‌సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.

Published : 05 Dec 2022 18:36 IST

హైదరాబాద్‌: జలవిద్యుత్ ఉత్పత్తి, వరద జలాల వినియోగంపై చర్చ, రూల్ కర్వ్స్ కోసం సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), ఆర్‌ఎంసీ (రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) భేటీకి తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు. కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి ఏపీ తరఫున ఈఎన్‌సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. నివేదికపై ఏపీ సభ్యుల సంతకాలు తీసుకున్న ఆర్‌ఎంసీ.. కేఆర్ఎంబీకి నివేదిక సమర్పించనుంది. మరోవైపు ఆర్‌ఎంసీ ముసాయిదా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ  కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. ఆర్‌ఎంసీ నివేదికలోని అంశాలు తమకు ఆమోదయోగ్యం కాదని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని