TG News: ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్‌ భగవత్‌

సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.

Updated : 21 May 2024 16:40 IST

హైదరాబాద్‌: సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్‌ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు. గడిచిన 9 రోజుల్లో వెయ్యి ఫోన్లు రికవరీ చేశామన్నారు. 35,945 రికవరీలతో కర్ణాటక తొలిస్థానంలో ఉండగా, 7,387 ఫోన్ల రికవరీతో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని