UPSC: 10 మంది తెలంగాణ అధికారులకు ఐఏఎస్‌ హోదా.. ప్రకటించిన యూపీఎస్‌సీ

తెలంగాణ రాష్ట్ర సర్వీసుకు చెందిన 10 మంది అధికారులకు యూపీఎస్‌సీ ఐఏఎస్ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫలితాలు పంపించింది.

Published : 07 Feb 2023 22:11 IST

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర సర్వీసుకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. రెవెన్యూ, నాన్‌ రెవెన్యూ కోటాలో ఐదుగురు చొప్పున అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించారు. జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్‌, కోరం అశోక్‌ రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్‌ నికోలస్‌లకు యూపీఎస్‌సీ ఐఏఎస్ హోదా కల్పించింది. రాష్ట్ర అధికారులకు జనవరి నెలలో యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. వాటి ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది.

అరుణశ్రీ, నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్ రెవెన్యూ విభాగం నుంచి ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కేటగిరీలో అశోక్ రెడ్డి, హరిత, వెంకటనర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్‌కు ఐఏఎస్ హోదా లభించింది. రాష్ట్ర సహకార శాఖకు చెందిన అశోక్ రెడ్డి.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వెంకటనర్సింహా రెడ్డి టీఎస్ఐఐసీ ఎండీగా, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా హరిత విధులు నిర్వర్తిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన కాత్యాయని మంత్రి కేటీఆర్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని