Raj Bhavan: రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌ వద్ద జాతీయ పతాకాన్ని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు.

Updated : 02 Jun 2024 15:47 IST

హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌ వద్ద జాతీయ పతాకాన్ని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ది వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యమని గవర్నర్‌ చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ శాంతికుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని