telangana state song: 2 నిమిషాల 30 సెకన్లతో తెలంగాణ రాష్ట్ర గీతం?

‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది.

Updated : 29 May 2024 20:44 IST

Telangana State song: (హైదరాబాద్‌): ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను సిద్ధం చేశారు. 2 నిమిషాల 30 సెకన్లతో రాష్ట్ర గీతం సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.

ఈసందర్భంగా బుధవారం ప్రముఖ సంగీత దర్శకుడు, పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి, ఆయన గాన బృందంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులను కలిశారు. కీరవాణి స్వరపరిచిన పాటను విన్నారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంది. దాని ఔనత్యం ఏమాత్రం దెబ్బతినకుండా ప్రతిఒక్కరూ సులువుగా ఆలపించేలా కీరవాణి ఆయన బృందం పాటను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు, గీత రచయిత అందెశ్రీ, ప్రొ|| కోదండరామ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని