Srinagar NIT: శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 30 Nov 2023 15:29 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎన్‌ఐటీ అధికారులు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. డిసెంబరు 20లోగా పరీక్షలు ఉన్నప్పటికీ.. రెండు వర్గాల విద్యార్థుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఎన్‌ఐటీ యంత్రాంగం హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారు. హఠాత్తుగా హాస్టళ్లు ఖాళీ చేయమనడంతో ఇక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 300 మంది తెలుగు విద్యార్థులు ఎన్‌ఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. శ్రీనగర్‌ నుంచి అత్యవసరంగా ప్రయాణం చేసేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు