Paderu: పాడేరును వణికిస్తున్న చలి

పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Updated : 24 Dec 2023 10:14 IST

పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. మరోవైపు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాడేరుకు తరలివస్తున్నారు. స్థానిక వంజంగి కొండల అందాలను చూసి మురిసిపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని