TG News: జూన్‌ 2న ట్యాంక్‌బండ్‌పై కార్నివాల్‌: సీఎస్‌ శాంతి కుమారి

రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు.

Published : 27 May 2024 18:43 IST

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2న ఉదయం గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారని, ఆ తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తానని చెప్పారు. 

‘‘జూన్‌ 2న ట్యాంక్‌బండ్‌పై స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్‌ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలూ ఏర్పాటు అవుతాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్‌ జరుగుతుంది. అందులో బాణసంచా, లేజర్‌ షో ఉంటాయి. 5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్‌ ప్రదర్శన చేస్తారు’’అని సీఎస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు