EC: వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది.

Published : 14 Apr 2024 16:17 IST

అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి వివరాలు కోరినట్టు సమాచారం. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. చిలకలూరిపేటలో ప్రధాని సభ, సీఎం రోడ్‌ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. జగన్‌ రోడ్‌ షోలో భద్రతా వైఫల్యంపై అధికారులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

రాయి దాడి ఘటనపై విజయవాడ సీపీ.. ఈసీకి నివేదిక సమర్పించారు. దర్యాప్తునకు 20 మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. సెల్‌ టవర్‌ డేటాను కూడా సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని