AP High Court: వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా?: హైకోర్టు

పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను నిలువరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Updated : 03 Apr 2024 16:35 IST

అమరావతి: పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను నిలువరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛను దారులు ఈ పిల్‌ దాఖలు చేశారు.

వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛను అందించేవారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. పింఛన్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో అందజేసేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ నిన్న కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్థలేని ఇతర రాష్ట్రాల్లో కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సజావుగా పింఛన్ల పంపిణీకి ఈసీఐ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పిల్‌ను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని