CM Revanth Reddy: నేను అలాంటి సీఎంను కాదు: రేవంత్‌రెడ్డి

గత భారాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాదిరి కాకుండా తాను సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు.

Updated : 23 Mar 2024 20:47 IST

హైదరాబాద్‌: గత భారాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. తాను సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చిన వారి బాధలను నేరుగా వినడంతో పాటు సంబంధిత శాఖలకు సూచనలు కూడా చేశారు.

కొన్ని సమస్యలను ఎన్నికల కోడ్‌ ముగియగానే పరిష్కరిస్తామని చెప్పినట్టు సమాచారం. రెవెన్యూ ఉద్యోగి దయాకర్‌ కలిసి తనకు 317 జీవో కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేయగా.. లోక్‌సభ ఎన్నికల నియయామవళి ముగియగానే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా సీఎం తన ఎక్స్‌ ఖాతాలో...

‘నేను…
చేరలేని దూరం కాదు…
దొరకనంత దుర్గం కాదు…
సామాన్యుడు మనిషిని నేను…
సకల జన హితుడను నేను’.. అని పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని