TS HighCourt: బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Updated : 05 Sep 2023 14:15 IST

హైదరాబాద్: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు సంజయ్‌ గైర్హాజరవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు సంజయ్‌ తరఫు న్యాయవాది గడువు కోరగా..  ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున మరోసారి గడువు ఇవ్వాలని కోరారు. 

ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణ ముగిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈనెల 12న బండి సంజయ్‌ హాజరవుతారని న్యాయవాది అభ్యర్థించారు. దీంతో సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలంటే సైనిక సంక్షేమ నిధికి ₹50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని