Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు

మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్‌ ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు లిమిటెడ్‌ అధికారులు ఖండించారు.

Updated : 18 May 2024 16:15 IST

హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు చేయలేదని, యథావిధిగానే ఉదయం 6గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని, ఇంకా ఆ వేళలపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులెవరూ మెట్రో రైళ్ల సమయం విషయంలో అయోమయానికి గురికావొద్దని, యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని