Rajasingh: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌.. డీజీపీకి ఫిర్యాదు

గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి.

Published : 29 May 2024 17:21 IST

హైదరాబాద్‌: గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు పలు నంబర్ల నుంచి ఫోన్‌ చేసి చంపుతామని బెదిరించినట్టు రాజాసింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. అయినా.. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసులకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, డీజీపీకి లేఖ రాశారు.

ప్రజాభవన్‌, నాంపల్లి కోర్టులో బాంబుపెట్టినట్టు ఫోన్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

ప్రజాభవన్‌, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్టు మంగళవారం డయల్‌ 100కు ఫోన్‌ చేసిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి వాసి శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది.. నాంపల్లి పోలీసులకు అప్పగించారు. గతంలో బైక్‌ చోరీల కేసులో శివకుమార్‌ నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఫోన్‌ చేసినట్టు నిందితుడు వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని