Razakar: రజాకార్‌ సినిమా నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ

రజాకార్‌ సినిమా (Razakar Movie) నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారు. 

Updated : 21 Mar 2024 16:20 IST

హైదరాబాద్‌: రజాకార్‌ సినిమా (Razakar Movie) నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్రక క‌థాంశంతో రూపొందిన సినిమా ర‌జాకార్‌. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం అనేక అడ్డంకుల్ని దాటుకొని మార్చి 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని