Hyderabad: హైదరాబాద్‌ - బెంగళూరు మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Updated : 25 Apr 2024 12:30 IST

హైదరాబాద్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌ - బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అర్ధరాత్రి 12.15 గంటలకు చివరిగా రైళ్లు బయలుదేరనున్నాయి. 1.10 గంటలకు ఇవి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఈ సమయంలో ఉప్పల్‌ స్టేడియం-ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతించనున్నారు. ఉప్పల్‌ మార్గంలోని మిగతా స్టేషన్లలో నిష్క్రమణలకు మాత్రమే వీలు కల్పిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని