TTD: శ్రీవారి ఆర్జిత సేవలు.. దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల బుకింగ్‌ కోసం తితిదే షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated : 17 May 2023 20:49 IST

తిరుమల: కలియుుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల బుకింగ్‌ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. డిప్‌లో టికెట్లు పొందిన వారు 20 నుంచి 22లోపు చెల్లింపులు చేసి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వర్చువల్ సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 23న శ్రీవాణి, అంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు జారీ చేస్తామని తెలిపింది. 24న రూ.300 దర్శన టికెట్లు, 25న తిరుపతిలో గదుల కేటాయింపు, 26న తిరుమలలో గదుల కేటాయింపు స్లాట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. సేవా టికెట్లు, దర్శన టికెట్ల జారీ తేదీ ఆదివారం వస్తే.. వాటిని మరుసటి రోజు విడుదల చేయనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. ఇకపై ఇవే తేదీల్లో ప్రతి నెలా శ్రీవారి ఆర్జిత సేవలు.. దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని