Tomato Price: మదనపల్లె మార్కెట్‌లో మరింత తగ్గిన టమాటా ధర

మదనపల్లె మార్కెట్‌లో గత ఐదు రోజులగా టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు మార్కెట్‌కు 300 టన్నులు టమాటాలు రాగా.. శుక్రవారం 400 టన్నులకుపైగా సరకును రైతులు తీసుకువచ్చారు.

Updated : 11 Aug 2023 12:56 IST

మదనపల్లె గ్రామీణం: మదనపల్లె మార్కెట్‌లో గత ఐదు రోజులగా టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు మార్కెట్‌కు 300 టన్నులు టమాటాలు రాగా.. శుక్రవారం 400 టన్నులకుపైగా సరకును రైతులు తీసుకువచ్చారు. దీంతో ఏ గ్రేడు టమాటాలు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, బీ గ్రేడు రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది. సగటున కిలో టమాటా రూ.26 నుంచి రూ.37 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్‌యార్డు కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు.

 గురువారం మదనపల్లె మార్కెట్‌లో ఏ గ్రేడ్ కిలో టమాటా రూ.50 నుంచి రూ.64 వరకు, బీ గ్రేడ్ రూ.36 నుంచి రూ.48 వరకు పలికింది. ప్రస్తుతం అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోని కోలార్‌ పరిధిలో టమాటా దిగుబడులు పెరిగాయని.. ఆ ప్రభావంతోనే తాజాగా ధరలు మరింత తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని