Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Jun 2024 09:12 IST

1. అమ్మతోడు.. ఆ రోజు నేను లేను

‘అమ్మతోడు.. నేను ఆ రోజు గొడవల్లో ఎక్కడా లేను! అయినా నన్ను స్టేషన్‌కు పిలుస్తున్నారు. బైండోవర్‌ చేస్తామంటున్నారు. నాకు ఆ గొడవలతోనే ఎలాంటి సంబంధం లేదు. నేను స్టేషన్‌కు రానన్నా..’ ఇదీ అధికార పార్టీకి చెందిన ఒక యువ నాయకుడి బేల మాటలు. గత ఎన్నికల తర్వాత క్రికెట్‌ సంఘంలో చీలిక కోసం అతను శతవిధాలా ప్రయత్నించారు. పూర్తి కథనం

2. ముందు సీఎస్‌ చూసి వెళ్లారు.. తర్వాత రౌడీ మూకలొచ్చాయి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆయన కుమారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను మే 20వ తేదీన పరిశీలించాక, త్రిలోక్‌ ముఠా వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నవరం, తూడెం గ్రామ రైతులు ఆరోపించారు.పూర్తి కథనం

3. రైలుబండి రద్దవుతోంది.. వేసవిలో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

వేసవి సెలవుల్లో కీలకమైన రైళ్లు రద్దు కావడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను పెంచాల్సిన రైల్వేశాఖ ఉన్నవాటిని సైతం హఠాత్తుగా రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతనెల మేలో పలు రైళ్లను వివిధ రోజుల్లో తాత్కాలికంగా రద్దు చేయడం గమనార్హం.పూర్తి కథనం

4. చిన్నారుల అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు

సంతానం లేని దంపతులు ప్రభుత్వ అనుమతితో చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలని శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. శుక్రవారం శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ నిర్మలా కాంతివెస్లీ, జాయింట్‌ డైరెక్టర్‌ సునందతో కలిసి హైదరాబాద్‌లోని శిశువిహార్‌ను తనిఖీ చేశారు.పూర్తి కథనం

5. పదేళ్ల ప్రగతి.. విశ్వనగర ఖ్యాతి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన హైదరాబాద్‌ గడ్డ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భాగ్యనగరి అభివృద్ధిలో దశాబ్దకాలం పెద్దది కాకపోయినా.. ఈ పదేళ్లలో చారిత్రక నగరికి మరిన్ని సొబగులు జతకూరాయి. విశ్వనగరికి అడుగులు పడ్డాయి. పూర్తి కథనం

6. ప్రేమను పంచండి.. విలువలతో పెంచండి

విశ్వంలో స్వార్థం లేని ప్రేమ చూపేది కేవలం అమ్మానాన్న మాత్రమే. పిల్లలను తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో అనేక మంది తల్లిదండ్రుల్లో ఎంతో మార్పు వచ్చింది. తమ పిల్లలు అందరికంటే ముందుండాలని, అపార తెలివి తేటలు సంపాదించాలని  కలలు కంటున్నారు. ఇది ఒక రకమైన స్వార్థమే అంటున్నారు నిపుణులు.పూర్తి కథనం

7. జగన్‌కు ఘోర పరాభవం తప్పదు: కె.నారాయణ

ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున ఓటేశారని, ఐదేళ్లలో వైకాపా నాయకులు చేయని పాపాలంటూ లేవన్నారు. ఓటమి ఖాయమని తెలిసినా.. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.పూర్తి కథనం

8. ఉద్యోగాలమ్ముకుంటున్న ఎంపీ వంగా గీత: మాజీ ఎమ్మెల్యే వర్మ

కాకినాడ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగాలను ఎంపీ వంగా గీత అమ్ముకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారని ఈఎస్‌ఐ డైరెక్టర్‌ను ఆయన ప్రశ్నించారు.పూర్తి కథనం

9. మోదీకి వివేకానందుడి ‘షికాగో’ బోధనలు తెలుసా?

కన్యాకుమారిలోని వివేకానంద స్మారకం వద్ద ధ్యానంలో ఆసీనుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికాలోని షికాగో సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రక బోధనల గురించి తెలుసా? అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శుక్రవారం ప్రశ్నించారు. 1893 సెప్టెంబరులో అమెరికాలోని షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు ప్రసంగించారు.పూర్తి కథనం

10. 150 ఏళ్లుగా రుతుపవనాల రాకలో మార్పులు

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్‌ 18న ప్రవేశించాయి. గతేడాది జూన్‌ 8న, 2022లో మే 29న, 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని