Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Jun 2024 09:12 IST

1. స్వతంత్రుల ముసుగులో వైకాపా ఏజెంట్లు

ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.. ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.. లెక్కింపు కేంద్రాల్లో, బయట గొడవలకు ఆస్కారం ఉందన్న వాదన వినిపిస్తుండటంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి కథనం

2. ‘అమరావతి రైతుల శాపంతో వైకాపా నాశనమవడం ఖాయం’

‘రాజధాని అమరావతి రైతులు, మహిళల శాపంతో వైకాపా నాశనమవడం ఖాయం. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు కంట కన్నీరు కారేలా చేసిన పాపం ఊరికే పోదు. అధికారం చేతిలో ఉందని చెలరేగిపోయారు. దళితుల్ని ఊచకోత కోశారు’.. అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.పూర్తి కథనం

3. రేపు ఏపీలో మద్యం దుకాణాల మూసివేత

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 4న మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది. ఆ రోజు ‘డ్రై డే’గా పరిగణించాలని పేర్కొంది. అయితే స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతల రీత్యా పలు జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాల మూసివేతకు అక్కడి కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.పూర్తి కథనం

4. నగలు వదిలేసి.. నగదు అపహరించి

ఇంటికి తాళం వేసి వెళ్లిన పావుగంట వ్యవధిలోనే చోరీ జరిగిన ఘటన తుంగతుర్తిలో కలకలం సృష్టించింది. సీఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నార్లపురం శ్రీనివాస్‌ ప్రధాన రహదారి పక్కనే ఉన్న షెటర్‌ పైభాగంలో నివాసం ఉంటూ మూడు షెటర్ల దూరంలో ఉన్న మరో దుకాణంలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. పూర్తి కథనం

5. తగ్గని బెట్టింగుల జోరు

మరో 24గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయినా పందెంరాయుళ్లు మాత్రం బెట్టింగులకు ఏమాత్రం తగ్గడం లేదు. నియోజకవర్గంలోని కందుకూరు, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో గత రెండు రోజులుగా రోజుకు రూ.2కోట్ల నుంచి రూ.4కోట్ల మేర పందేలుగాశారు. ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు వచ్చిన తర్వాత ఈ పందేలు మరింత వేగం పుంజుకున్నాయి.పూర్తి కథనం

6. పులొస్తుంది.. వేటాడుతుంది

పులుల సంరక్షణ కేంద్రాల్లో నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఒకటి. విస్తీర్ణంలో ఇది దేశంలోని యాభై మూడింటిలోనే పెద్దది. జిల్లాలో మార్కాపురం అటవీ డివిజన్‌ పరిధిలోని పెద్దదోర్నాల, కొర్రప్రోలు, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, నెక్కంటి, వీపీ సౌత్, మార్కాపురం రేంజ్‌లలో విస్తరించి ఉంది. పశ్చిమ ప్రకాశంతో పాటు నంద్యాల, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమలలో 73కు పైగా పులులున్నాయి. పూర్తి కథనం

7. అందుకే హరీశ్‌రావును అమెరికాకు పంపించారు: మంత్రి కోమటిరెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు తిరిగిరావద్దని చెప్పించడానికి మాజీ మంత్రి హరీశ్‌రావును భారాస అధినేత కేసీఆర్‌ అమెరికాకు పంపించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.పూర్తి కథనం

8. మందకొడిగా... బుల్లెట్‌ రైలు

రైలు ప్రయాణికులను ఎప్పటినుంచో ఊరిస్తున్న బుల్లెట్‌ రైలు అవరోధాలు అధిగమిస్తూ ఇండియాలో ముందడుగు వేయాల్సి ఉంది. చైనా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, స్వీడన్‌ వంటి దేశాల్లో ఈ రైళ్లు దూసుకుపోతూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌లో మాత్రం అది ఇంకా సాకారం కాలేదు.పూర్తి కథనం

9.  సమగ్ర అవగాహన ఉంటేనే ఎఫ్‌అండ్‌ఓలో ట్రేడ్‌ చేయాలి

తక్కువ సమయంలో లాభాలను పొందొచ్చనే ఆలోచనే ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్ల (Futures and Options (F&O) విభాగంలో రిటైల్‌ మదుపర్ల ప్రాతినిథ్యం పెరగడానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్‌ స్వరూపాన్ని కలిగి ఉండటం వల్ల కూడా ఎఫ్‌అండ్‌ఓల వైపు మదుపర్లు ఆకర్షితులవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.పూర్తి కథనం

10. రెండు రోజుల్లో రాష్ట్రానికి నైరుతి

రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 6వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని