Top 10 News @ 9 AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

Top News: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం...

Published : 26 Jun 2023 09:00 IST

1. అడిగినంత ఇస్తేనే ‘మీసేవ’

రాష్ట్రంలో ప్రజలకు సత్వర, మెరుగైన ఈ-పౌరసేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన మీసేవా కేంద్రాలు పలుచోట్ల అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే అధికంగా వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పౌరసేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, మీసేవా కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. సాదా డిగ్రీతోనూ.. అసాధారణ భవిత!

మేటి భవిష్యత్తు సొంతం చేసుకోవడానికి ప్రొఫెషనల్‌ కోర్సులే చదవాల్సిన అవసరం లేదు. ఉన్నతస్థాయి అవకాశాలను అందుకోవడానికి ఈ చదువులొక్కటే ప్రామాణికం కాదు. సాధారణ డిగ్రీలతోనూ సంచలనం సృష్టించవచ్చు. ఇంటర్మీడియట్‌ తర్వాత దేశంలో ఎక్కువమంది బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లోనే చేరుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. క్రిప్టో గాలం.. ఇన్‌స్టా జాలం

డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన ఓ మహిళ  బిట్‌కాయిన్‌లో పెట్టుబడులంటూ ఓ యువకుడికి రూ.48 లక్షలు కుచ్చుటోపీ పెట్టింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధి చౌటుప్పల్‌కు చెందిన యువకుడి(28)కి టిండర్‌ డేటింగ్‌ యాప్‌లో ఈ నెల తొలివారంలో ఓ మహిళ సందేశం పంపింది. ఆ తర్వాత అతని ఫోన్‌ నంబరు తీసుకుని వాట్సాప్‌లో ఛాటింగ్‌ మొదలుపెట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మణిపుర్‌లో సైన్యాన్ని చుట్టుముట్టి.. మిలిటెంట్లను విడిపించిన మహిళలు 

మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. సైన్యం అదుపులోకి తీసుకొన్న 12 మంది మిలిటెంట్లను విడిపించుకునేందుకు ఏకంగా 1,500 మంది మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టడం గమనార్హం. దీంతో పౌరుల భద్రత దృష్ట్యా మానవతా దృక్పథంతో మిలిటెంట్లను విడిచిపెట్టినట్లు సైన్యం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. దొంగ ఓట్లకు ఇంకులతో సహా సిద్ధం చేశారు

రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, ఎన్నికల సంఘం వాడే ఇంకులతో సహా సిద్ధం చేసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండిలో రాజోలు నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. యువ‘ధీర’

ఏ దేశ పురోగమనంలోనైనా యువత పాత్రే కీలకం. వారు దారి తప్పితే జాతి భవిష్యత్తు అంధకారమే. ఈ నేపథ్యంలో శారీరకంగా, మానసికంగా పరిపూర్ణంగా మార్చాలనే ఆలోచనతో యువ పారిశ్రామికవేత్త జె.నిశాంత్‌రెడ్డి ‘ప్రాజెక్టు ధీర’కు శ్రీకారం చుట్టారు. ‘మత్తు’ నీడ వారిపై పడకుండా చేయడమే దీని లక్ష్యం. డివిజన్‌, జిల్లాస్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 3న జేఎన్‌టీయూలో వందల మంది విద్యార్థుల సమక్షంలో పలువురు ప్రముఖుల చేతులమీదుగా ధీర వెబ్‌ యాప్‌ను ప్రారంభించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వినాశనం రెండు వైపులా.. 

భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియో హెరిటేజ్‌ సైట్‌) ఎర్రమట్టిదిబ్బల చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న పనులు ఆ ప్రాంత ఉనికికే ప్రమాదకరంగా మారాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. తిరుగుబాటుతో పుతిన్‌కు సవాలే

ఒక రోజంతా రష్యాను కలవరపెట్టేలా చేసిన కిరాయి సైన్యం- వాగ్నర్‌ గ్రూపు ఆ తర్వాత అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోయినా ఆ పరిణామం మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నాయకత్వానికి సవాల్‌గానే భావిస్తున్నారు. క్రెమ్లిన్‌లో, రక్షణశాఖలో లోపాలను ఈ పరిణామం చాటిందని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘యుద్ధ అధ్యయన సంస్థ’ వ్యాఖ్యానించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కన్నేసి... కాజేసి..!

తన తల్లి పేరున ఓ ట్రస్టుకు చెందిన స్థలాన్ని అక్రమ పద్ధతుల్లో రాయించుకున్న ఓ వైకాపా నేత.. తర్వాత అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధితో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ప్లాట్లు వేసి అమ్మేందుకు ప్లాన్‌ తయారు చేయించారు. కొందరు కొనుగోలుదారుల నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నారు. స్థలాన్ని చదును కూడా చేశారు. బాగా గిరాకీ ఉంటుంది.. వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని, అంతా సవ్యంగా సాగుతోందని భావించిన వైకాపా నేతలకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. చెప్పుకోలేని బాధతో బడికి!

ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులు సూటు బూటు ధరించి వస్తుంటే.. ఇటు ప్రభుత్వ పాఠశాలల పిల్లలేమో పాత బడిన సివిల్‌ దుస్తులు ధరించి..  ప్లాస్టిక్‌ కవర్లల్లో పుస్తకాలు పెట్టుకొని.. కాళ్లకు చెప్పుల్లేకుండా అరికాళ్ల మంటలతో హాజరవుతున్నారు. ప్రభుత్వం ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నా అందరికీ సకాలంలో అందకపోవడంతో పాత దుస్తులే ధరించి వస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని