Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Aug 2023 09:20 IST

1. కారుచౌకగా ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌

ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్‌ బెడదను కొంచెమైనా తగ్గించుకోవడానికి ఉపయోగపడే విధానం రీసైక్లింగ్‌! ఈ పదార్థాన్ని కొత్తగా ఉత్పత్తి చేసి, పుడమికి హాని కలిగించే బదులు పునర్‌వినియోగమే నయమని పరిశోధకులు చెబుతున్నారు. రీసైకిలింగ్‌ను సులభతరం చేసే అద్భుత విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పద్ధతిలో ఇంధన వినియోగం బాగా తగ్గడమే కాకుండా నాణ్యమైన రీసైకిల్డ్‌  ప్లాస్టిక్‌ లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉచిత ఫోను ఆశ చూపి.. బాలికపై ఉద్యోగి అత్యాచారం

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేస్తోందని ఓ బాలిక (17)ను నమ్మించిన ప్రభుత్వ ఉద్యోగి.. ఆమెను తనతోపాటు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా టోడాభీమ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సునీల్‌కుమార్‌ జన్‌గిడ్‌ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. రోజువారీ కూలీలైన తల్లిదండ్రులు శనివారం పనికి వెళ్లగా బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం గమనించిన సునీల్‌కుమార్‌..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మంత్రి విశ్వరూప్‌ ఇలాకాలో.. రాజుకున్న అసమ్మతి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధికార వైకాపాలో అసమ్మతి రాజుకుంది. గ్రామాల్లో వాలంటీర్లకున్న ప్రాధాన్యంలో కొంచెమైనా తమకు దక్కడం లేదంటూ ఇప్పటికే ఓ వర్గం వాపోతోంది. ఆదివారం పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి నాయకులు అల్లవరంలో సమావేశమై మంత్రి విశ్వరూప్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గేట్‌ దాటితే... ఉన్నత విద్య.. ఉద్యోగం!

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, కొలువులకు ఎంపిక చేస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జ్వరంతో ఉన్న పాపకు రేబిస్‌ టీకా ఇచ్చిన నర్సు

కేరళలోని ఎర్నాకుళం సమీపంలో ఉన్న అంగమల్లి తాలూకా ఆసుపత్రిలో జ్వరంతో ఉన్న ఏడేళ్ల పాపకు ఓ నర్సు పొరపాటున రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చింది. ఆగస్టు 11న జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఆ నర్సును విధుల నుంచి తొలగించాలని ఆదివారం నిర్ణయించింది. ఆసుపత్రిలోని ల్యాబ్‌ బయట ఆ బాలిక ఒక్కతే కూర్చొని రక్తపరీక్ష కోసం నిరీక్షిస్తూ ఉండగా.. ఈ తప్పిదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థితి మరింత దిగజారింది. 2022-23 సవరించిన బడ్జెట్ల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన రాష్ట్రాల ర్యాంకుల్లో ఏపీ 11వ స్థానానికి పడిపోయింది. 2021-22 ర్యాంకుల్లో ఏపీ 8వ స్థానంలో ఉండేది. 2022-23కు సంబంధించి మహారాష్ట్ర మొదటి స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలో, ఒడిశా మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో, ఝార్ఖండ్‌ ఐదో స్థానంలో ఉన్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సమాధులనూ వదలని ఇసుకాసురులు!

ఇసుక అక్రమార్కులు సమాధులనూ వదలడం లేదు. చనిపోయిన వాళ్లను గుర్తు చేసే చిన్న నిర్మాణాలనూ తొలగించేసి ఇసుక తవ్వుకుపోతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది ఒడ్డున హిందూ శ్మశానవాటిక ఉంది. చనిపోయిన వ్యక్తుల తిథులు, సంక్రాంతి నాడు వారి కుటుంబ సభ్యులు వెళ్లి సమాధుల వద్ద పూలు ఉంచి తలచుకొని వస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘పావలా వడ్డీ రుణం’ రాయితీ బటన్‌ నొక్కుడు మరిచారే!

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంపైనే ఆధారపడిన రాష్ట్ర ప్రభుత్వం.. లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీ రుణం కింద ఇప్పిస్తున్న రూ.35 వేలకు విడుదల చేయాల్సిన రాయితీ నిధుల ఊసెత్తడం లేదు. 2023 సంక్షేమ క్యాలెండర్‌లోనూ దాని గురించి పేర్కొనలేదు. కొంతమంది లబ్ధిదారులు ఈ రుణాలు తీసుకుని ఏడాదికిపైనే అవుతోంది. వీరు రూ.1,500 నుంచి రూ.2,000 చొప్పున నెల వాయిదాలు చెల్లిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అయ్యో.. ఆడబిడ్డా!

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో సుమారు మూడు నెలల కిందట తనిఖీలు చేసిన వైద్యశాఖ అధికారులు ఒక ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు చేస్తున్నట్లు ఆధారాలతో గుర్తించి కేసు నమోదు చేశారు. కానీ కొందరు ప్రజాప్రతినిధుల జోక్యంతో దీన్ని నీరుగార్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కేసు నుంచి తప్పించడానికి రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అదే ఆసుపత్రిలో ఇప్పుడు యథావిధిగా వైద్యసేవలు కొనసాగుతుండడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డీప్‌ఫేక్‌ మాయాజాలం!

హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం ఫొటోలు ఆమె సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. కొద్దిరోజులకే ఓ అజ్ఞాత వ్యక్తి ఆమె నగ్నచిత్రాలను ఆమె కాబోయే భర్తకు పంపాడు. దాంతో పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. చివరి నిమిషంలో సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులను ఆశ్రయించగా.. ఇదంతా ‘డీప్‌ఫేక్‌’ మాయాజాలమని తేల్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు