Hyderabad: హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి  శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 

Published : 19 Apr 2024 20:39 IST

హైదరాబాద్‌: నగర శివారులో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు కూలాయి. మహేశ్వరం మండలం తుమ్మలూరు- కందుకూరు రహదారిపై నాలుగు కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పడిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని