ఆస్పత్రికి వెళ్తే దంపతులపై విరిగిపడిన చెట్టు.. భర్త మృతి

బొల్లారం కంటోన్మెంట్‌ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్టు విరిగి పడింది.

Updated : 21 May 2024 13:47 IST

సికింద్రాబాద్: బొల్లారం కంటోన్మెంట్‌ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్టు విరిగి పడింది. ఈ ఘటనలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతడి భార్య సరళా దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు అందరినీ కలచి వేశాయి. సరళాదేవిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని