APPSC: నకిలీ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో గ్రూప్‌-1 ఉద్యోగానికి యత్నం

నకిలీ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో గ్రూప్‌-1 ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

Published : 22 Aug 2023 22:09 IST

విజయవాడ: నకిలీ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో గ్రూప్‌-1 ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన లోకేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని విజయవాడ సౌత్‌జోన్‌ ఏసీపీ రవికిరణ్‌ తెలిపారు. 111 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాత పరీక్షలు పూర్తయ్యాయి. అర్హులైన అభ్యర్థులకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించారు. అయితే, మదనపల్లెకు చెందిన లోకేశ్‌ .. తాను 167.7 సెం.మీ ఎత్తు ఉన్నట్టు వైద్యుల ధ్రువీకరణ పత్రాన్ని ఏపీపీఎస్సీ అధికారులకు సమర్పించాడు.

లోకేశ్‌ను చూసిన అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అభ్యర్థి ఎత్తును మరోసారి లీగల్‌ మెట్రాలజీ అధికారులు కొలిచారు. ఎత్తులో తేడా రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీపీఎస్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధ్రువపత్రాన్ని పరిశీలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లోకేశ్‌ ఫిట్‌నెస్‌ను ధ్రువీకరించినట్టు గుర్తించారు. ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వైద్యులను కూడా విచారిస్తామని ఏసీపీ తెలిపారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని