TS High Court: ప్రణీత్‌రావుకు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

Updated : 21 Mar 2024 11:46 IST

హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తొలుత పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు. అనంతరం పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పోలీసు స్టేషన్‌లో కనీస వసతులు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదుదారు అయిన ఏసీపీ రమేశ్‌కు దర్యాప్తులో పాత్ర లేదన్నారు. పిటిషనర్‌.. తన న్యాయవాది ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారన్నారు. ఏడు రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని.. మిగిలింది మూడు రోజులేనని, ఉపయోగంలేని ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని